పాతపట్నం ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాల ఏడో తరగతి విద్యార్థిని సవర లావణ్య (12) ఆత్మహత్య ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేయాలని సీతంపేట ఐటిడిఏలో గిరిజన సంఘాలు సోమవారం ఐటిడిఏ పిఓకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం జిల్లా డిఎల్ఓ అధ్యక్షులు సవర కుమార్ మాట్లాడుతూ బాలిక ఆత్మహత్య చేసుకుంటే ఏమి పట్టినట్టు వ్యవహరిస్తున్న పాఠశాల సిబ్బందిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.