శ్రీకాకుళం జిల్లాలో వివాహిత ఆత్మహత్య కలకలం
పలాస మండలం ఈదురాపల్లిలో మీరజాక్షి (21) అనే మహిళ ఇంట్లో సోమవారం ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మెళియాపుట్టి మండలం టకోయిగాతలవలస గ్రామానికి చెందిన మీరజాక్షికి 7 నెలల క్రితం ఈదురాపల్లి చెందిన జవాన్ వినోద్ తో వివాహమైంది. ఆమె ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా వారం క్రితం ఇదే గ్రామంలో కుటుంబ కలహాలతో ఓ జవాన్ భార్య సూసైడ్ చేసుకున్నారు.