సామాజిక అంతరాలను రూపుమాపేదే విద్య అని యుటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. వెంకటేశ్వర్లు అన్నారు. మందస మండలం హరిపురంలో యూటీఎఫ్ స్వర్ణోత్సవ మహాసభలు సోమవారంతో ముగిశాయి. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసమే కాకుండా, ప్రజలకు ఇబ్బంది వచ్చిన ప్రతి సందర్భంలోనూ వారిని ఆదుకోవడానికి యుటీఎఫ్ కార్యకర్తలు పని చేస్తారని తెలిపారు. అనంతరం నూతన కమిటీ ఎన్నికలు నిర్వహించారు. పలు తీర్మానాలు ప్రవేశపెట్టారు.