పలాస: ప్రతి కుటుంబం దీపావళి వెలుగులతో కలకలలాడాలి- ఎమ్మెల్యే
ప్రతి కుటుంబం దీపావళి వెలుగులతో కళకళలాడుతూ అభివృద్ధి పథంలో నడవాలని ఎమ్మెల్యే గౌతు శిరీష పిలుపునిచ్చారు. గురువారం రాత్రి పలాసలోని ఆమె స్వగృహంలో తల్లితండ్రులతో కలిసి దీపావళి వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. ఈ ఏడాది ఎంత ప్రజలంతా అభివృద్ధి పథంలో నడిచే విధంగా ముందుకు కొనసాగాలని ఆమె కోరారు. ప్రతి ఒక్కరి ఇళ్లల్లో వెలుగులతో పాటు అభివృద్ధి కూడా కొనసాగాలని ఆమె ఆకాంక్షించారు.