ఏపీలో నేటి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఇప్పటికే బుకింగ్స్ ప్రారంభం కాగా.. ఇవాళ్టి నుంచి గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేయనున్నారు. సిలిండర్ కొనుగోలు చేసిన 48 గంటల్లో ప్రభుత్వం రాయితీ డబ్బులు బ్యాంకు ఖాతాలో జమ చేస్తుంది. శ్రీకాళం జిల్లా ఈదుపురంలో ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టనున్నారు. ఏలూరు జిల్లా ఐఎస్ జగన్నాథపురంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లబ్ధిదారులకు సిలిండర్లు పంపిణీ చేస్తారు.