సిపిఐ శత జయంతి ఉత్సవాలు జయప్రదం చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ పిలుపునిచ్చారు. ఈ మేరకు సోమవారం పలాసలో మండల సమితి సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రతి శాఖలో శత జయంతి ఉత్సవాలు డిసెంబర్ 20నుండి 26 వరకు జెండా ఆవిష్కరణ ఘనంగా నిర్వహించాలన్నారు. నిత్యవసర ధరలు ఆకాశానికి అంటుతున్న రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న తీరును ఖండించారు.