శ్రీకాకుళం జిల్లాలోని కంచిలి పట్టణంలో సోమవారం భారీగా వర్షం దంచికొట్టింది. సుమారు అరగంట పాటు కురిసిన వర్షంతో ప్రజలు తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నారు. మరోవైపు వాహనదారులు, ప్రయాణికుల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో కంచిలి బ్రిడ్జి కింద ట్రాఫిక్ జామ్ నెలకొంది. దీంతో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.