ఇచ్చాపురం: కేంద్రమంత్రిని కలిసిన కూటమి నేతలు

57பார்த்தது
ఇచ్చాపురం: కేంద్రమంత్రిని కలిసిన కూటమి నేతలు
కేంద్ర విమానయాన శాఖ మంత్రి, ఆసియా పసిఫిక్ సభ్య దేశాల చైర్మన్ రామ్మోహన్ నాయుడును శ్రీకాకుళంలో ఇచ్చాపురానికి చెందిన కూటమి నాయకులు ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఇందులో భాగంగా పట్టణంలో నెలకొన్న పలు ప్రధాన సమస్యలను రామ్మోహన్ నాయుడికి వివరించారు. ముఖ్యంగా రహదారి, డ్రైనేజీ వ్యవస్థల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని కూటమి నేతలు కోరారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி