ఘనంగా రక్షాబంధన్ వేడుకలు

56பார்த்தது
సోదరీ, సోదరుల అనురాగానికి ప్రతీకగా చెప్పుకునే రాఖీ పండుగను ఇచ్ఛాపురం నియోజకవర్గంలోని కవిటి, కంచిలి, సోంపేట, ఇచ్ఛాపురం మండలాలకు చెందిన ప్రజలు సోమవారం ఘనంగా జరుపుకున్నారు. రాఖీలు కట్టేందుకు వచ్చిన అక్క చెల్లెమ్మలతో పట్టణాలు, పల్లెలు కళకళ లాడాయి. కొంతమంది తమ తోబుట్టువులు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ అలయాలకు వెళ్లి పూజలు చేశారు. పాఠశాలలు, కళాశాలల్లో కూడా రక్షాబంధన్ వేడుకలు ఉత్సాహంగా జరిగాయి.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி