లావేరు మండలంలోని లక్ష్మీపురం గ్రామానికి చెందిన బోర శంకర్ (36) శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. శంకర్ ఈనెల 23న ఇంట్లో విద్యుత్ బోర్డు వద్ద విద్యుత్ షాక్ కు గురై తీవ్రంగా గాయపడటంతో వెంటనే ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. మృతుని భార్య అసరితల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.