విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా 8 పూరిల్లు దగ్ధమైన ఘటన జి. సిగడాం మండలం సంతవురిటి గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. స్థానికుల సమాచారంతో పొందూరు, రాజాం అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మిగతా ఇళ్లకు మంటలు వ్యాప్తి చెందకుండా మంటలను అదుపు చేశారు. 8 ఇంటిలోని వస్తువులన్నీ కాలి బూడిదయ్యాయి. సుమారు రూ. 15 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు కోరారు.