ఉరవకొండ తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఉపాధి హామీ నిధుల అవకతవకలపై సామాజిక తనిఖీలో బయటపడిన అక్రమాలపై సమగ్ర విచారణ చేపట్టాలని సీపీఎం నాయకులు సోమవారం ధర్నా నిర్వహించారు. సమగ్ర విచారణ జరిపించి నిధులు కాజేసిన వారిపై క్రిమినల్ కేసులు పెట్టి వారి వద్ద నుంచి సొమ్మును రికవరీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు తహసీల్దార్ మహబూబ్ బాషాకి వినతి పత్రం అందజేశారు.