అనంతపురం జిల్లా కేంద్రంలోని లక్ష్మీనగర్ లో ఉన్న జేసీ నివాసానికి మంగళవారం హోం మంత్రి వంగలపూడి అనిత వెళ్లారు. ఆమెను ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఘనంగా ఆహ్వానించి తేనేటి విందు ఇచ్చారు. అనంతరం వారు గత వైసీపీ ప్రభుత్వంలో తమపై, టీడీపీ కార్యకర్తల పై పెట్టిన కేసులపై హోంమంత్రితో చర్చించినట్లు సమాచారం.