30 ఏళ్లుగా హక్కు అనుభవం కలిగిన తన ఇంటికి పరిహారం చెల్లించకుండా అధికారులు కూల్చేందుకు యత్నించడం బాధాకరమని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. తాడిపత్రి మండల పరిధిలోని హుసేనాపురంలో ముసలయ్య నాయుడుకు చెందిన 75 సెంట్ల భూమి తాడిపత్రి-నంద్యాల ప్రధాన రహదారి ఏర్పాటుకు అధికారులు సేకరించారు. అయితే ఎలాంటి నష్టపరిహారం చెల్లించకుండా ఇంటిని కూల్చేందుకు ప్రయత్నించగా అడ్డుకున్నామన్నారు.