పుట్టపర్తిలో ఈనెల 18న కనకదాసు జయంతిని రాష్ట్ర పండగగా నిర్వహించనున్నట్లు మంగళవారం టీడీపీ జిల్లా కార్యదర్శి సామకోటి తెలిపారు. తన సాహిత్యంతో సమాజ అసమానతలపై గొంతెత్తిన సాహిత్యకారుడు, సంఘ సంస్కర్త కురుభ కనకదాసు అని కొనియాడారు. కర్నాటకలో జన్మంచిన కనకదాసు రాయలసీమలోనూ కుల వ్యవస్థ, అసమానతలకు వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తిని అన్నారు. అలాంటి వ్యక్తి జయంతిని రాష్ట్ర పండగగా నిర్వహించాలని సీఎం నిర్ణయించారన్నారు.