పెనుగొండ పట్టణంలో, హిందూపురం పార్లమెంటు సభ్యులు బి కే పార్థసారథి ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రూ. 100 చెల్లించి సభ్యత్వం పొందిన వారికి 5 లక్షల రూపాయల ప్రమాద భీమా వర్తిస్తుందని తెలిపారు. బీమా పరిహారం 2 లక్షల నుంచి 5 లక్షలుగా పెరిగింది. పార్టీ బలోపేతానికి గతంలో చేసిన నమోదు కంటే ఎక్కువ సభ్యత్వం నమోదు చేయాలని పార్థసారథి పిలుపునిచ్చారు.