పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయం వద్ద మండల కన్వీనర్ సోమశేఖర్ ఆధ్వర్యంలో.. తాసిల్దార్ మారుతికి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం నాయకులు మాట్లాడుతూ.. జిల్లాలోని అతిపెద్ద మండలం గోరంట్ల మండలం అని, గోరంట్ల మండలంలో ఇప్పటికి తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల ఈ మండల ప్రజలు ఇతర రాష్ట్రాలకు వలసలు వెళుతున్నారన్నారు. దీని అడ్డుకోవాలంటే గోరంట్ల మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలన్నారు.