పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండల అభివృద్ధి అధికారి కార్యాలయంలో శనివారం పంచాయతీ అధికారులకు సచివాలయ సిబ్బందికి అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీవో రఘునాథ గుప్తా మాట్లాడుతూ అక్టోబర్ 2వ తేదీ స్వచ్ఛ భారత్ దినోత్సవం ఘనంగా నిర్వహించేందుకు ప్రణాళిక ఏర్పాటు చేశామన్నారు. అందుకు 15 రోజుల ముందు నుండి స్వచ్ఛతాహి సేవ కార్యక్రమాలు నిర్వహించుటకు సిబ్బందికి అవగాహన కార్యక్రమం నిర్వహించామన్నారు.