విద్యుత్ స్మార్ట్ మీటర్ల ప్రక్రియను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో కళ్యాణదుర్గం ఆర్డీవో కార్యాలయం వద్ద గురువారం ధర్నా చేపట్టారు. అంతకుముందు నాయకులు, కార్యకర్తలు తహసీల్దార్ కార్యాలయం వద్ద నుంచి ఆర్డీవో కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు అచ్యుత్ ప్రసాద్ మాట్లాడుతూ స్మార్ట్ మీటర్ల ఏర్పాటు ప్రక్రియను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.