5 కోట్ల ఆంధ్రుల శ్రేయస్సు కూటమి ప్రభుత్వం లక్ష్యమని గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పేర్కొన్నారు. శనివారం గుంతకల్లు మండలంలోని గుంతల మయమైన కసాపురం రోడ్డుకు మరమ్మతు పనులు చేపట్టారు. నియోజకవర్గంలో రూ. 54 లక్షలతో రోడ్డు మరమ్మతు పనులకు పనులు ప్రారంభించారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం హాజరై పనులను ప్రారంభించారు.