మంత్రి సత్య కుమార్ యాదవ్ ధర్మవరం ఆర్డీవో ఆఫీస్ ప్రాంగణంలో స్వచ్ఛభారత్ ట్రాక్టర్లను ప్రారంభించారు. జిల్లాలోని ఐదు పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం ఐదు ట్రాక్టర్లను కేటాయించింది. బత్తలపల్లి, సంజీవపురం, మాల్యవంతం, ధర్మవరం, మల్లకాల్వ, రావులచెర్వు, తాడిమర్రి మండలం దాడితోట పంచాయతీలకు ఈ ట్రాక్టర్లు అందించబడ్డాయి. మహాత్మా గాంధీ స్ఫూర్తితో, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగిస్తున్నారని అన్నారు.