కేంద్ర హోమ్ శాఖమంత్రి అమిత్ షాను ఢిల్లీలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ సోమవారం కలిశారు. అమరావతి, పోలవరం నిర్మాణానికి కేంద్రం అందిస్తున్న సహాయానికి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర పునర్నిర్మాణానికి ముఖ్య మంత్రి చంద్రబాబు నాయకత్వంలో ఎన్డీయే ప్రభుత్వం విశేష కృషి చేస్తుందన్నారు. గత ఐదేళ్లలో జరిగిన నష్టాన్ని పూడ్చాలంటే కేంద్రం నుంచి మరింత ఉదారంగా సహాయం అందించాలని కోరారు.