ఏపీ రిజర్వేషన్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ అనంతపురం జిల్లా ప్రెసిడెంట్ గా ముత్యాలరాజు నియమితులయ్యారు. ఈ మేరకు శనివారం ఆర్ ఈ ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ రామచంద్ర, యూనియన్ సభ్యులతో కలిసి తీర్మానిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన మాట్లాడుతూ. రాష్ట్రంలోని రిజర్వేషన్ ఉద్యోగుల ప్రయోజనాలే లక్ష్యంగా పని చేస్తానని అన్నారు. కార్యక్రమంలో ఆర్ ఈ ఎఫ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నాగభూషణం, తదితరులు పాల్గొన్నారు.