అనంతపురం: ఈ నెల 29న దిశ సమావేశం

81பார்த்தது
అనంతపురం: ఈ నెల 29న దిశ సమావేశం
అనంతపురం జిల్లా దిశ సమావేశం ఈ నెల 29న అనంతపురంలోని రెవెన్యూ భవనంలో జరగనుందని కలెక్టర్ డా. వినోద్ కుమార్ శుక్రవారం వెల్లడించారు. ఈ కార్యక్రమం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ అధ్యక్షతన జరగనున్నదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సభ్యులందరూ తప్పనిసరిగా హాజరు కావాలని పేర్కొన్నారు. అజెండా ప్రకారం గ్రామీణ, పట్టణ తాగునీరు, ఆసుపత్రులు, ఆరోగ్య సేవలు, తదితర అంశాలపై సమీక్షలు ఉంటాయని తెలిపారు.

தொடர்புடைய செய்தி