అనంతపురంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో అధికారుల సహాయక చర్యలు చేపట్టారు. అనంతపురం రూరల్ పరిధిలోని ఉప్పరపల్లి గ్రామం, ఆటోనగర్ కాలనీ, కళాకారుల కాలనీ తదితర ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఆదేశాల మేరకు బుధవారం ఉదయం జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ సూచనలతో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో ప్రజలకు అవసరమైన పాలు, బ్రేక్ ఫాస్ట్ పంపిణీ చేశారు.