అనంతపురం నగరంలో మంగళవారం నుంచి ఈ నెల 25వ తేదీ వరకు ఆధార్ స్పెషల్ క్యాంపులు ఏర్పాటు చేసినట్లు అదనపు కమిషనర్ పీవీ రామలింగేశ్వర్ మంగళవారం పేర్కొన్నారు. 5 ఏళ్ల లోపు పిల్లలకు ఆధార్ తప్పనిసరని, న్యూ ఎన్రోల్మెంట్ జరిగేలా చర్యలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు. 22న రాణినగర్ లోని ఆశా ప్రాథమిక పాఠశాల, హమాలీ కాలనీ వార్డు సచివాలయం, 23న పాతూరు నంబర్-2 స్కూల్, హమాలీ కాలనీలోని యూపీ స్కూల్లో స్పెషల్ క్యాంపులు ఉంటాయన్నారు.