ఉదయగిరి మండల విద్యాశాఖ అధికారి తోట శ్రీనివాసులు శనివారం మండలంలోని వెంకట్రావుపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలోని రికార్డులు పరిశీలించారు. అపార్ ఐడీలు త్వరగా పూర్తి చేయాలని హెచ్. ఏం బలరాం కు సూచించారు. అలాగే పాఠశాలలో నిర్మాణంలో ఉన్న పలు భవనాలను సందర్శించారు. విద్యార్థుల పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు జమీర్, తదితరులు ఉన్నారు.