ఉదయగిరి మండలం గండిపాలెం జలాశయం సమీపంలోని శ్రీ సిద్దేశ్వర స్వామి ఆలయంలో స్వామి వారికి బుధవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మహాలయ అమావాస్యను పురస్కరించుకొని స్వామివారికి అభిషేకాలు విశేష పూజలు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాల స్వీకరించారు. చుట్టుపక్కల దట్టమైన చెట్లు సమీపంలో జలాశయం ఉండడంతో ఆహ్లాదకర వాతావరణం కోసం ఎక్కువగా ప్రజలు తరలివచ్చారు.