కక్షతోనే ఇళ్ళు కూల్చి వేస్తామని బెదిరింపులు: నాగార్జున
నెల్లూరు నగర కార్పొరేషన్ పరిధిలోని 13వ డివిజన్ లో టి. డి. పి కి ఓట్లు వేయలేదనే కక్ష్యతో పేదల ఇళ్ళు కూల్చి వేస్తామని టిడిపి నాయకులు బెదిరిస్తున్నారని స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ ఊటుకూరు నాగార్జున సోమవారం కార్పొరేషన్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వినతిపత్రం అందజేశారు. ఈ మేరకు స్థానిక కార్పొరేటర్ల తో కలిసి అడిషనల్ కమిషనర్ వైఓ నందన్ తో సోమవారం వినతిపత్రం అందజేశారు.