నెల్లూరు: మద్యం షాపు ఏర్పాటుపై 11వ రోజుకు చేరిన నిరశన
నెల్లూరు నగరంలోని పరమేశ్వరి నగర్ వద్ద ఉన్న బ్రాందీ షాపును ప్రభుత్వం వెంటనే తొలగించాలని ముస్లిం మైనార్టీలు చేస్తున్న ఆందోళన శుక్రవారం 11వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ముస్లిం మైనార్టీ నేతలు మాట్లాడుతూ పాఠశాలలు, ప్రార్థన స్థలాల వద్ద మద్యం షాపును ఏర్పాటు చేయటం వల్ల స్థానిక ప్రజలకు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఉన్నతాధికారులు తక్షణం స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు.