వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని నాయుకుడిని మోసం చేసి ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్సీ లను, ఎంపీ లను ప్రజలు ఎప్పటికీ విశ్వసించరని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్యే పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు నగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల హామీల అమలులో చంద్రబాబు విఫలమయ్యారన్నారు.