తూఫాన్ తీవ్రత వలన ఆహారం అందక ఇబ్బంది పడుతున్న ప్రజలకు అండగా తెలుగుదేశం నాయకులు ఉండాలని కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకట క్రిష్ణారెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు కావలి 35వ వార్డు యువ నాయకుడు మల్లి రాము ఆధ్వర్యంలో 300 మందికి ఆహార పొట్లాలను బుధవారం పంపిణీ చేశారు. కావలి చెరువు కట్ట సంఘం, పీజీ కాలేజీ రోడ్, అన్నపగుంట కాలనీ, బస్ స్టాండ్, రైల్వేస్టేషన్ నందు ఆహార పొట్లాలను పంపిణీ చేశారు.