ప్రకాశం జిల్లా లోని అత్యంత వెనుకబడిన పశ్చిమ ప్రాంతం అభివృధ్ధి చెందాలంటె మార్కాపురం ను జిల్లా కెంద్రంగా ప్రకటించాలని ధర్నాలు, ర్యాలీలు, రిలె నిరహారదీక్షలు , పై అధికారులకు వినతి పత్రాలు గత వారం రోజుల నుండి ఉదృతంగా కార్యక్రమాలను మార్కాపురం జిల్లా సాధన
జె ఎ సి సమితి ఆధ్వర్యంలో మార్కాపురం లో జరుగుతున్నవి. అన్ని వర్గాల ప్రజలు, అన్ని విద్యార్ధి, ప్రజా సంఘాలు వివిధ కార్యక్రమాలు చెస్తున్నారు. అందులో భాగంగా 15—2—2022 మంగళవారం బంద్ ప్రకటించి ప్రజలు స్వచ్చందంగా పాల్గొనడం మార్కాపురం జిల్లా కెంద్రం గా ప్రకటించడమనె ఆకాంక్ష ప్రజలలో ఎంత బలంగా ఉందో అద్దం పడుతుంది.
గతంలో 1957 లోనె మార్కాపురం పార్లమెంటు నియోజక వర్గంగా ఉన్నదని, ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో మార్కాపురం నందు జిల్లా కార్యాలయాలు ఉన్నట్లు , రాజకీయ క్రీడలో భాగంగానే ఈ రోజు అట్టడుగున , సాగునీరు, తాగునీరు లెక , ఉపాధి లెక ఇక్కడి యువత సుదూర ప్రాంతాలకు వలసలు వేఋళుతున్నారని , కర్నూలు , కడప, నెల్లూరు జిల్లాలలో మారుతూ మారుతూ చివరకు ప్రకాశం జిల్లాలోని ఒంగోలు జిల్లా కెంద్రంగా ఉన్నది. పశ్చిమ వెనుక బడిన ప్రాంతంలో అప్పటి నుండి ఇప్పటికి అభివృధ్ధికి నోచుకో లెదని మార్కాపురం జిల్లా సాధన సమితి జె ఎ సి ఉద్యమ నాయకులు పోశం వెంకట కృష్ణారావు ఒక ప్రకటనలో తీవ్ర ఆవేదన వ్యక్తం చెసారు.
ప్రకాశం జిల్లాలో అన్ని ప్రాంతాలకు నడుమ ఇంచు మించు 60 కి. మీ ల దూరంలో ఉన్న మార్కాపురం ను జిల్లా ప్రాంతంగా ప్రభుత్వం వెంటనే ప్రకటించాలని లెదంటె రాబోయె రోజుల్లో ఉద్యమం ఉదృతం చెస్తామని హెచ్చరించారు.