పిఎం సూర్యఘర్ సోలార్ కనెక్షన్లను విద్యుత్ వినియోగదారులు తీసుకోవాలని కనిగిరి విద్యుత్ శాఖ ఈఈ ఏ. వీరయ్య శనివారం తన కార్యాలయంలో తెలిపారు. ఈ పథకం ద్వారా బ్యాంకు ద్వారా సబ్సిడీని పొందవచ్చని తెలిపారు. వినియోగదారుల ఇంటిపై సోలార్ ప్యానల్ నిర్మించుకొని నెలకు 300 నుండి 500 యూనిట్లు వరకు ఆదా చేసుకోవచ్చన్నారు. బ్యాంకు రుణం కూడా ఇస్తుందని ఒక కేవీ కు రూ. 30, 000 వంతున సబ్సిడీ వస్తుందని తెలిపారు.