గిద్దలూరు మండలంలోని యూటీఎఫ్ కార్యాలయంలో శనివారం మండల సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా జిల్లా అధ్యక్షులు వీరారెడ్డి, ఎన్నికల అధికారిగా జిల్లా కార్యదర్శి రమణారెడ్డి, పరిశీలకులుగా రాష్ట్ర కౌన్సిలర్ సత్యనారాయణ రెడ్డి హాజరై నూతన మండల కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులుగా రమణారెడ్డి, అధ్యక్షులుగా డాక్టర్ మొర్రి పిచ్చయ్య, ప్రధాన కార్యదర్శిగా వెంకటేశ్వర్లను ఎన్నుకున్నారు.