జిపిఎస్, యుపిఎస్ విధానాలను రద్దుచేసి పాత పింఛన్ స్కీం ఓపిఎస్ ను పునరుద్ధరించాలని తాళ్లూరు మండలంలోని ఏపీటీఎఫ్ నాయకులు ఆదివారం నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. తాళ్లూరు తహసిల్దార్ కార్యాలయం వద్ద దర్శి, కురిచేడు, దొనకొండ మండలాల నుండి ప్రభుత్వ ఉపాధ్యాయులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ఎన్ శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు.