రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతి
ఆగి ఉన్న లారీని ఢీకొన్న సంఘటనలో మణికంఠ అనే ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతి చెందారు. టంగుటూరు మండలం మర్లపాడుకు చెందిన చింతల వెంకట మణికంఠ హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఇంజినీర్ గా పని చేస్తూ వినాయక చవితి పండుగకు స్వగ్రామం వచ్చారు. బుధవారం ద్విచక్ర వాహనం పై మర్లపాడు నుంచి ఒంగోలు వస్తూ పాత జాతీయ రహదారి పై ఆగి ఉన్న లారీని ఢీ కొట్టి అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.