కనిగిరి: మానవత్వం చాటుకున్న సీఐ
కనిగిరి మాచవరం వద్ద సోమవారం కడప జిల్లా పొద్దుటూరుకి చెందిన వ్యక్తి కారు బోల్తా పడింది. సమాచారం అందుకున్న సీఐ ఖాజావలి, పోలీస్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. కారులో ఓ మహిళ, చిన్న పాప ఉండటంతో బోల్తా పడిన కారును స్థానికుల సహాయంతో ఎత్తి సీఐ క్షతగాత్రులను బయటికి తీశారు. ఈ క్రమంలో సీఐకి కుడి చేతికి గాయమైంది. కనిగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయన వైద్య సేవలు పొందారు.