సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి ఆదివారం లబ్ధిదారులకు అందజేశారు. కనిగిరిలోని అమరావతి గ్రౌండ్ లో ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే చెక్కులను పంపిణీ చేశారు. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ఆరు మంది లబ్ధిదారులకు మంజూరైన రూ. 5. 95 లక్షలు విలువైన చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఎన్డీఏ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అని ఎమ్మెల్యే గుర్తు చేశారు.