వెలిగండ్ల: నేరాలు జరగకుండా చూసుకోవాలి: సీఐ

82பார்த்தது
వెలిగండ్ల: నేరాలు జరగకుండా చూసుకోవాలి: సీఐ
వెలిగండ్ల పోలీస్ స్టేషన్ ను పామూరు సీఐ భీమ్ నాయక్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ లో పలు రికార్డులను తనిఖీ చేశారు. అనంతరం పోలీస్ స్టేషన్ సిబ్బందితో సమావేశం నిర్వహించి, అసాంఘిక కార్యకలాపాలు, నేరాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. వివిధ కేసుల వివరాలు, స్థితి గతులపై ఎస్సైని ఆరా తీశారు.