కనిగిరి నియోజకవర్గంలో బదిలీ అయిన ఎస్సైలు వీరే

70பார்த்தது
కనిగిరి నియోజకవర్గంలో బదిలీ అయిన ఎస్సైలు వీరే
కనిగిరి నియోజకవర్గంలో ప్రస్తుతమున్న ఎస్సైలను బదిలీ చేస్తూ జిల్లా ఎస్పీ ఏఆర్. దామోదర్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. కనిగిరి ఎస్సైగా టి. శ్రీరామ్, హనుమంతునిపాడు ఎస్సైగా కే. మాధవరావు, పెద్ద చెర్లపల్లి ఎస్సైగా జి. కోటయ్య, పామూరు ఎస్సైగా టి. కిషోర్ బాబు, చంద్రశేఖరపురం ఎస్సైగా ఆర్. సుమన్, వెలిగండ్ల ఎస్సైగా మధుసూదన్ రావును నియమిస్తూ ఎస్పీ ఉత్తర్వులు జారీ చేశారు.

தொடர்புடைய செய்தி