సిఎస్ పురం మండలంలో వెలసిన ప్రముఖ పుణ్యక్షేత్రం మిట్టపాలెం నారాయణస్వామి ఆలయానికి ఆదివారం భక్తుల ద్వారా రూ. 2.27.483 ఆదాయం వచ్చినట్లుగా ఆలయ అధికారులు సోమవారం వెల్లడించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ టికెట్లు అమ్మకం ద్వారా రూ. 1.27. 400, లడ్డు ప్రసాదం విక్రయం ద్వారా రూ. 37. 570, ఇతర విరాళాల ద్వారా రూ. 8.500 వచ్చినట్లుగా వారికి తెలిపారు.