ఎల్ కోటలో పర్యటించిన ఈజీఎస్ అడిషనల్ కమిషనర్
ఎల్ కోట మండలంలో ఈజిఎస్ అడిషనల్ కమిషనర్ శివప్రసాద్ గురువారం పర్యటించారు. కిత్తన్నపేటలో ఎన్ఆర్ఈజీఎస్ విధులతో నిర్మిస్తున్న సిసి రోడ్డును పరిశీలించారు. అలాగే ఖాసాపేటలో నిర్మిస్తున్న సిసి రోడ్డు, ఎల్ కోట తలారిలో క్యాటిల్ షెడ్, కొట్యాడలో హార్టికల్చర్ సపోట తోటను పరిశీలించారు. సీసీ రోడ్ల నిర్మాణ పనుల్లో నాణ్యత పాటించాలని సూచించారు. డుమ పిడి కళ్యాణ చక్రవర్తి, ఎంపీడీవో అప్పారావు తదితరులు పాల్గొన్నారు.