కొత్తవలస ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో రమణయ్య ఆధ్వర్యంలో బుధవారం జాయింట్ మండల్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ రమణమూర్తి పాల్గొన్నారు. నియోజకవర్గంలో గల 5 మండలాల్లో స్వయం సహాయక సంఘాలకు శతశాతం రుణాలు మంజూరు చేయాలని స్థానిక బ్యాంకు మేనేజర్లకు కోరారు. ఋణాలు మంజూరులో పారదర్శకంగా వ్యవహరించాలన్నారు. స్థానిక బ్యాంకర్లు, వెలుగు సమైక్య అధికారులు పాల్గొన్నారు.