పార్వతీపురం జిల్లా కలెక్టరేట్ ఎదుట ఆదివారం సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ప్రధాన కార్యదర్శి మన్మధరావు, 104 అధ్యక్షుడు ఆనందరావు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం సమస్యలను పరిష్కరించాలని కోరారు. ముఖ్యంగా ఉద్యోగ భద్రత, సకాలంలో వేతనాలు, అక్రమంగా వసూలైన పీఎఫ్, ఈఎస్ఐ మొత్తాలను తిరిగి చెల్లించడం, వాహన ఫిట్నెస్, ఇన్సూరెన్స్ వెంటనే చేయడం, జీవో నెం.7 ప్రకారం వేతనాలు చెల్లించాలన్న డిమాండ్లు చేశారు.