అసెంబ్లీ సమావేశాల్లో బుధవారం జిల్లా మంత్రి, ఎమ్మెల్యేలు గళమెత్తారు. మన్యం జిల్లా సమస్యలను సభ దృష్టికి తీసుకువెళ్లారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, వాటి ప్రగతిని వివరించారు. గిరిజన ప్రాంతాల్లో డోలీ మోతలు లేకుండా చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సంధ్యారాణి తెలిపారు. రెండు వేల గిరిజన గ్రామాల్లో రూ. 2, 500 కోట్లతో రోడ్ల నిర్మాణాలు చేపడుతున్నట్టు చెప్పారు. ఫీడర్ అంబులెన్స్‌లను కూడా మంజూరు చేశామన్నారు.