సీతంపేట మండలంలోని కీసరిజోడు పంచాయతీకి చెందిన దిబ్బగూడలో శనివారం అగ్ని ప్రమాదం జరిగింది. సన్నాపురం నాగరాజుకు చెందిన పూరిల్లు షార్ట్ సర్క్యూట్ తో పూర్తిగా దగ్ధమయ్యింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేశారు. సుమారు రూ. 50 వేల ఆస్తి నష్టం జరిగిట్లు అంచనా వేశారు. ఈ ఘటనపై ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని బాధిత కుటుంబం కోరుతున్నారు.