ఈపీఎఫ్ కనీసం రూ. 9వేలు ఇవ్వాలని సీఐటీయూ గరివిడి డివిజన్ నాయకుడు ఎ. గౌరి నాయుడు డిమాండ్ చేశారు. పెన్షన్ పెంపుపై ప్రధానమంత్రి మోదీ ప్రభుత్వం మొండి వైఖరిని విడనాడాలని డిమాండ్ చేస్తూ మంగళవారం గరివిడి అంబేడ్కర్ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూ. 9వేలు కనీస పెన్షన్ ఇవ్వాలని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును కేంద్ర ప్రభుత్వం అమలు చేయడం లేదని విమర్శించారు.