బొబ్బిలి మండలం పారాది వంతెన ఆంధ్ర మరియు ఒరిస్సా రాష్ట్రాలను కలిపే పారాది బ్రిడ్జి పనులు శరవేగంగా జరుగుచున్నాయి. పాత బ్రిడ్జ్ రిపేర్ కారణంగా గత రెండు సంవత్సరాలుగా ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. అయితే, గత 3 నెలలుగా జరుగుతున్న పారాది కొత్త బ్రిడ్జి పనులు శరవేగంగా సాగుతున్నాయి. 2025 సెప్టెంబర్ నాటికి పారాది కొత్త బ్రిడ్జి పూర్తి చేసే పనిలో ఉన్నామని కాంట్రాక్టర్ మరియు ఇంజనీర్లు తెలియజేశారు.