విశాఖ డెయిరీ తగ్గించిన పాలు ధరను వెనక్కి తీసుకునేలా చూడాలని ఎమ్మెల్యే బేబినాయనను రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ఎస్. గోపాలం కోరారు. పాడి రైతుల సమస్యలను పరిష్కరించాలని శనివారం బొబ్బిలి కోటలో ఎమ్మెల్యే బేబినాయనకు రైతు సంఘం ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖ డెయిరీ పాలు ధరను తగ్గించడంతో పాడి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.